రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శనివారం మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన జే. పూజిత ఉత్తమ ప్రతిభను చాటింది. ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 423/440 మార్కులతో కర్నూలులోని ఒక ప్రైవేట్ కళాశాలలో టాపర్‌గా నిలిచింది. దీంతో పూజితను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వాసుబాబు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.