మంత్రాలయం టౌన్ జూనియర్ కాలేజీలో 11 గంటలకు కోసిగి టౌన్ జూనియర్ కళాశాలల్లో 12 గంటలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాల్లో శనివారం మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి పాల్గొంటారని టీడీపీ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోసిగిలోని రామక్కవ్వ గుడి దగ్గర మధ్యాహ్నం 1 కు తాగునీటి కొళాయిల ప్రారంభోత్సవానికి హాజరవుతారు. టీడీపీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.