మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, మంత్రాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందకరమని, కాలేజీ రహదారి మరమ్మతులు, కాంపౌండ్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, కోసిగి మండల నాయకులు, కాలేజీ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.