ఉరుకుందలో భవన నిర్మాణానికి రూ. 1 లక్ష విరాళం

50చూసినవారు
ఉరుకుందలో భవన నిర్మాణానికి రూ. 1 లక్ష విరాళం
కౌతాళం: మండలం ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో అన్నదానం నూతన భవన నిర్మాణం కొరకు శనివారం అనంతపురంకు చెందిన ఉరుకుందరావు రూ. 1, 00, 116/- విరాళంగా అందించారు. అందుకు సంబంధించిన చెక్కును దేవస్థాన కార్యాలయంలో అందజేశారు. దేవస్థాన కార్యనిర్వాహనాధికారి మేడిపల్లి విజయరాజు దాతకు స్వామివారి ఆశీర్వాదాలు, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్