ముంబైకు చెందిన భక్తుడు ప్రశాంత్ కృష్ణాపూర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం అన్నదానంతో పాటు ఇతర సేవల కోసం రూ.4.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని మఠం మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మఠం అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత పీఠాధిపతి స్వయంగా ఫలమంత్రాక్షతులు ఇచ్చి ఆశీర్వదించారు.