మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ధార్మిక పర్యటనలో భాగంగా బెంగళూరు, చెన్నై పట్టణాలకు వెళ్లినట్లు మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న స్వామీజీ ఈనెల 13న తిరిగి మంత్రాలయానికి రానున్నారని తెలిపారు.