మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన మురారి శేషాద్రి శెట్టి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో, నిందితుడైన గ్రామానికి చెందిన బోయ దొండు నాగేంద్రను మాధవరం సమీపంలో అరెస్టు చేశామని, బుధవారం ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐ రామాంజులు, ఎస్సై విజయకుమార్‌లు తెలిపారు. గత నెల 18న జరిగిన ఈ దొంగతనంలో రూ. 32. 90 లక్షల ఆభరణాలు, రూ. 1 లక్ష విలువైన వెండి, రూ. 2. 50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.