మంత్రాలయం మండలం చిలకలడోణలో పెళ్లి వేడుకలో భాగంగా రోడ్డు దాటుతున్న ముగ్గురిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. శనివారం స్థానికుల సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మాధవరం నర్సన్న, మహనంది, నల్లనకు గాయాలయ్యాయని తెలిపారు. బాధితులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన కారును గ్రామస్థులు ధర్మపురం టోల్ గేట్ వద్ద ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.