మంత్రాలయం శ్రీమఠంలోని శ్రీసుశమీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా మంగళవారం టీటీడీ తరఫున ఏఈవో మోహన్ రాజు శ్రీవారి వస్త్రాలు సమర్పించారు. రాఘవేంద్ర మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ ఆశీస్సులతో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో బృందావనంలో రాఘవేంద్ర స్వామి వారికి మహామంగళమైన పంచామృతాభిషేకంతో సహా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.