తుంగభద్ర నది మంత్రాలయంలో పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 308 మీటర్లు ఉండగా, ప్రవాహం 12,000 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కారణంగా వాగులు, వంకల ఉద్ధృతి పెరిగి నదిలోకి నీరు చేరుతోంది. వరద ప్రవాహాన్ని చూసి నదీ తీర రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం శ్రీమఠం అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు ఇస్తున్నారు.