మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆదివారం పంచాయతీ కార్యాలయం వారు ఏర్పాటు చేసిన కుళాయి పైప్‌లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. దీంతో పంచాయతీ కార్యదర్శి శేషన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.