రీ సర్వేలో భూముల్లో లొటుపాట్లు ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం నౌలేకల్లులో తహసీల్దారు శ్రీనాథ్ ఆధ్వర్యంలో రీసర్వే గ్రామసభ అవగాహన కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. ఈనెల 20వ తేదీ నుంచి గ్రామంలో భూ రీ సర్వే నిర్వహిస్తామన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్లు వేణుసూర్య, శ్రీనివాసరాజు, ఆర్ఐ జెర్మియా పాల్గొన్నారు.