మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండల కేంద్రంలో ఆదివారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. బసవన్నకొండ దిగువ ఎర్రవంకలో నడుచుకుంటూ వెళ్తున్న చిరుతను రైతులు చూసారు. మత్తులో కదలకుండా ఉండగా సమాచారం అందుకున్న ఎస్సై హనుమంతురెడ్డి పోలీసులు, అటవీశాఖ సిబ్బందితో కలిసి భద్రత ఏర్పాటు చేశారు. అటవీ అధికారుల సాయంతో చిరుతను బోనులో బంధించి, నీళ్లు పోసి మత్తు నుండి బయటపడగొట్టి వాహనంలో తరలించారు.