పెద్దకడబూరు: నౌలేకల్ గ్రామంలో గ్రామ సభకు రాని సర్పంచ్

77చూసినవారు
పెద్దకడబూరు: నౌలేకల్ గ్రామంలో గ్రామ సభకు రాని సర్పంచ్
పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన పురస్కరించుకొని సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఇందుకుగాను ముఖ్యంగా గ్రామ సభకు అధ్యక్షతన వహించే గ్రామ సర్పంచ్ గ్రామ సభకు హాజరు కాలేదు. గ్రామ సభకు వస్తే ఎక్కడ గందరగోళం ఏర్పడుతుందో అని రాలేదా అని సదరు వ్యక్తులు గుసగుసలాడుతున్నారు. దీంతో పాటు వైసీపీ నాయకులు కూడా కనుమరుగవడం గమనార్హం. వెంటనే అధికారులు స్పందించి తీర్మానం చేసిన పనుల పైన దృష్టి పెట్టి మా పనులు చేయాలని గ్రామ సభలో గ్రామ ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్