పెద్దకడబూరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం అంబేడ్కర్ యూత్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నినదించారు. తల్లి జన్మనిస్తే అంబేడ్కర్ జీవించే హక్కును కల్పించారని గుర్తు చేశారు.