కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తైన సందర్భంగా పెద్దకడబూరులో గురువారం తెలుగు రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. కుటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టౌన్ అధ్యక్షులు మల్లికార్జున, ఆంజనేయులు, తలారి అంజి తదితరులు ఉన్నారు.