తప్పుడు దృవీకరణ పత్రాలతో మా అన్న భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ దేశాయ్ శుక్రవారం డిమాండ్ చేశారు. మా అన్న మహమ్మద్ ఉస్మాన్ దేశాయ్ (లేట్) కు చెందిన 4. 59 సెంట్ల భూమిని మరో అన్న కుమారులు అమీర్ హంజా, ఖలందర్ బాషా, హకీమ్ హుసేన్ లు తప్పుడు దృవీకరణ పత్రాలతో కబ్జా చేశారని, వీరిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.