జిల్లా విద్యా శాఖ అధికారి ఆదేశాల మేరకు "డొక్కా సీతమ్మ- మధ్యాహ్న భోజనం " వంట ఏజెన్సీలకు పెద్దకడబూరులోని కేజీబీవీలో ఈ నెల 17 నుండి జరుగుతున్న శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండలంలో 43 పాఠశాలల వంట ఏజెన్సీలు పాల్గొని శిక్షణలో పాల్గొన్నాయని ఎంఈఓ - 2 రామమూర్తి, ఎస్ఓ రుక్సానా పర్వీన్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తయారు చేసి వడ్డించాలని సూచించారు.