గ్రావెల్ తో రహదారికి మరమ్మతులు

57చూసినవారు
గ్రావెల్ తో రహదారికి మరమ్మతులు
పెద్దకడబూరు మండలంలోని పీకలబెట్ట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి గ్రామ సర్పంచ్ మూలింటి లక్ష్మీ, వైసీపీ నాయకులు మూకిరెడ్డి సోమవారం గ్రావెల్ వేయించి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీకలబెట్ట గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. గ్రామనికి రైల్వే ట్రాక్ పై గేటు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్