మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం మూగలదొడ్డి రోడ్డుకు రూ. 1.25 కోట్లు, మేకడోన–కల్లుకుంట రోడ్డుకు రూ. 1.35 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. బుధవారం మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, బీజేపీ ఇన్ ఛార్జ్ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి హాజరై, భూమిపూజ చేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కుటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. నాణ్యతతో పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.