గోనెగండ్ల సీఐ గోనెగండ్ల శ్రీ చింతలముని, నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. సుమారు 75మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.