పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లోని ఏడవ తరగతి విద్యార్థి బీఆర్ నవీన్ కుమార్ జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయినందుకు మంగళవారం పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. కోసిగిలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ - 14 విభాగంలో తాలూకా స్థాయి పోటీల్లో నవీన్ కుమార్ ప్రతిభ చాటి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. దీంతో పాఠశాల డైరెక్టర్ రంగారెడ్డి, హెచ్ఎం ప్రసాద్ నవీన్ కుమార్ కు అభినందించారు.