పొలం పిలుస్తోంది ప్రోగ్రామ్ ను సద్వినియోగం చేసుకోండి

73చూసినవారు
పొలం పిలుస్తోంది ప్రోగ్రామ్ ను సద్వినియోగం చేసుకోండి
మంత్రాలయం మండలంలోని సూగూరు, బుదూరు గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం ఏఓ జీరాగణేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా పంటలపై తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాలలో వివిధ పంటలను పరిశీలించి రైతులకు పంట ఏ దశలో ఉంది తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఇందులో ఉద్యాన శాఖ అధికారి అపర్ణ, అశోక్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్