మంత్రాలయం మండలం చెట్నిహళ్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పద్మశాలి దేవగట్టు ఈరన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి గ్రామానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మాధవరం రాంరెడ్డి కుటుంబం, తెదేపా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.