స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిని అందరూ అలవరచుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ మహేష్ హితవు పలికారు. గురువారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేష్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.