పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో గల కృష్ణా నదిలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మత్స్య శాఖ ఆధ్వర్యంలో 21 లక్షల చేప పిల్లల సీడ్ ను శుక్రవారం వదిలారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, టిడిపి నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పథకాలు ప్రవేశపెడుతుందన్నారు.