బనగానపల్లె: హెల్మెట్ ధరింపు ప్రాముఖ్యతపై పోలీసుల అవగాహన

54చూసినవారు
బనగానపల్లె: హెల్మెట్ ధరింపు ప్రాముఖ్యతపై పోలీసుల అవగాహన
నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరింపు ప్రాముఖ్యతపై పోలీసులు బనగానపల్లె, డోన్ వాహనచోదకులకు అవగాహన మంగళవారం కల్పించారు. వాహనాల తనిఖీ చేపట్టి హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై చైతన్యం చేయడంతో పాటు రోడ్డు భద్రత నిబంధనల అమలుపై దృష్టి సారించారు. ఓవర్ లోడింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్ , సెల్ ఫోన్ డ్రైవింగ్, తదితర ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్