కొత్తపల్లి మండలంలోని మాడుగుల, ఎర్రమటం, ముసలిమాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమన్ని మండల వ్యవసాయ అధికారి మహేష్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు బి. ఆంజనేయ హజారు కావడం జరిగింది. మండలంలో ప్రస్తుతం రెండవ పంట వేసిన ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ కొరకు సమీప మీ సేవలో కాని సిఎస్సి సెంటర్లో కాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.