కొత్తపల్లి మండలంలోని జీ. వీరాపురం, కొత్తపల్లిలోని ఆర్వో ప్లాంట్లను ఎంపీడీఓ మేరి బుధవారం ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ జూబేర్ తో కలసి తనిఖీ చేశారు. వాటర్ ప్లాంట్లవద్ద పరిసరాలు, ట్యాంకుల నిర్వహణ, క్లోరినేషన్ సరైన పద్ధతిలో చేస్తున్నారాలేదా, ఫిల్టర్'చేసేందుకు నీటిలో లిక్విడ్ తగిన మోతాదులో వేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా ట్యాంకులను పరిశుభ్రపరుస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు.