జూపాడుబంగ్లా మండల పరిధిలోని తత్తూరు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి తిరుణాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పోటీలు సోమవారం ప్రారంభించారు. ఒంగోలు జాతి గిత్తల బలప్రదర్శన తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు పోటీలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.