జూపాడుబంగ్లా మండల పరిధిలోని మండ్లేము గ్రామ సచివాలయం-2 సోమవారం ఎంపీడీవో గోపికృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో డి. గోపికృష్ణ సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ అందరూ టైంకి రావాలని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. జి ఎస్ డబ్ల్యూ ఎస్ సర్వేల ప్రగతిని పరిశీలించి సచివాలయ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.