కొత్తపల్లి కృష్ణానదిలో నిలిచిఉన్న ఖాళీ బోటు బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ సంబంధించి రివర్ పెట్రోలింగ్ కోసం ప్రభుత్వం అటవీ శాఖకు ఒక బోటు మంజూరు చేసింది. దానిని ఫారెస్టు అధికారులు కృష్ణానదిలో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం తరలించేందుకు సంగమేశ్వరం వద్ద ఉంచారు. మంగళవారం ఈదురు గాలులు ఎక్కువగా రావడంతో బోటు నీటిలో తిరిగి బోల్తాపడింది. ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు.