కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా ఆర్ జయ శేఖర్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆదోని పట్టణం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తపల్లి మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లోని ప్రజలు అల్లర్లకు గొడవలకు పోకుండా అన్నదమ్ముళ్ల వలె జీవించాలన్నారు.