తెలంగాణ రాష్ట్రం జూరాల ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రా రాష్ట్రంలోని శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైల జలాశయం నీటిమట్టం క్రమేపీ పేరుగుతు 840 అడుగులకు చేరుకుంది. జలాశయం నీటిమట్టం పేరుగుతుండడంతో సప్తనది ప్రాంతంలో శ్రీశైలం వెనుకజలాలైన కృష్ణాజలాలు ఆదివారం సప్తనది తీరం వద్ద వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయాన్ని చుట్టేస్తున్నాయి. సంగమేశ్వరాలాయాన్ని తాకిన సప్తనదులకు మహా మంగళహారతి ఇచ్చారు.