కొత్తపల్లి: ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి

85చూసినవారు
కొత్తపల్లి: ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
కొత్తపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు గత ఏడు వారాల నుండి వేతనాలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తపల్లి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వారాల తరబడి పనులు చేసిన వేతనాలు మంజూరు చేయకపోవడం సమంజసం కాదన్నారు.

సంబంధిత పోస్ట్