కొత్తపల్లి మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలో ఈశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన పారువేట ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ముందుగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు ఆలయ పురోహితులు లాల్ బహదూర్ శాస్త్రి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు, మంగళహారతి, తీర్థ ప్రసాదాలు నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల ఉత్సవమూర్తుల విగ్రహాలను పల్లకి ఊరేగింపు నిర్వహించారు.