ప్రస్తుత సమాజంలో ఉన్న యువత చెడు మార్గాల నుంచి మంచి మార్గంలో నడిపేది క్రీడలే అని కొత్తపల్లి సీఎస్ఐ సంఘం పాస్ట్రెట్ చైర్మన్ రెవ. బి భరత్ దివాకర్ బాబు టీడీపీ క్లస్టర్ కోఆర్డినేటర్ లింగ స్వామి గౌడ్ మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్ తెలిపారు. శనివారం మండలంలోని శివపురం గ్రామంలో దళిత కాలనీ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.