కొత్తపల్లి: రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు

60చూసినవారు
కొత్తపల్లి: రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి మహేష్ రైతులకు శుక్రవారం సూచించారు. మండలానికి ట్రాక్టర్ పనిముట్లు 22 మంజూరు కాగా ఇప్పటివరకు 7 పనిముట్లకి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పవర్ స్పేయర్లు 16 మంజూరు అవ్వగా 4 కి దరఖాస్తు చేసుకొన్నారు. రైతులు గ్రామంలోని రైతు సేవ కేంద్రం సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్