నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ , రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి సూచనలతో.. సోమవారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శివపురం గ్రామం కొలను భారతి దేవస్థానం నందు జరుగుతున్న వసంత పంచమి వేడుకల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆత్మకూరు డివిజన్ డ్రోన్ టీం ద్వారా నిఘా ఉంచామని ఎస్సై కేశవ్ సోమవారం తెలిపారు. ఇందులో సిబ్బంది పాల్గొన్నారు.