మిడుతూరు మండలం మిడుతూరులోని బురద రోడ్డుపై శుక్రవారం సీపీఎం నాయకులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి పట్టణంలోని నందికొట్కూరు రహదారి (అంకిరెడ్డి కాంప్లెక్స్ సమీపంలో)పై భారీగా వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. నాయకులు పి. పకీర్ సాహెబ్ మాట్లాడుతూ వర్షానికి రోడ్డుపై నీరు నిలవడంతో బురదమయంగా మారుతోందని, దీనివల్లప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు.