నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం మిడుతూరు మండలంలోని అలగనూరు రిజర్వాయర్ను సందర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పిద నిర్ణయాల వల్లే కడప జిల్లా తాగునీటి అవకాశాలను కోల్పోయిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యనించారు. సొంత జిల్లాకు కూడా న్యాయం చేయలేని నేత జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.