నందికొట్కూరు: భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం

76చూసినవారు
నందికొట్కూరు: భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం
నందికొట్కూరు మండల పరిధిలో కొణిదేం గ్రామంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రధోత్సవం బుధవారం అత్యంత వైభవంగా, కనుల పండుగగా రమణీయంగా నిర్వహించారు. ఈ రధోత్సవం గ్రామ సర్పంచ్ కొంగర నవీన్, ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్, ఈవో కార్తీక్ ఆధ్వర్యంలో వైభవంగా సాగింది. ఎమ్మెల్యే గిత్తజయ సూర్య, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్రా శివానంద రెడ్డి, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్