నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన బన్నెల నిశాంత్ తల్లి మల్లేశ్వరికు బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 1, 02, 620 చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.