కర్నూలు నుండి ఆత్మకూరు వరకూ జాతీయ రహదారి ఇరువైపుల అనుమతి లేని లే అవుట్లపై కుడా, రెవెన్యూ, పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు డిమాండ్ చేశారు. రహదారి పెరగడంతో భూ కబ్జాదారులు అక్రమంగా వెంచర్లు వేస్తూ ప్లాట్లు అమ్మకానికి పెట్టినట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అక్రమ లేఔట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.