పగిడ్యాల ప్రజలకు జనవరి నెలలో సంక్రాంతి కానుకగా వచ్చిన విద్యుత్ బిల్లులు షాక్ కి గురి చేస్తున్నాయని, అదనపు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేయాలని సిపిఎం కన్వీనర్ పి. పక్కిరి సాహెబ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ అదనం చార్జీలు భారం మోపడంతో సరికాదన్నారు.