నందికొట్కూరు మండలంలోని మల్యాల, బొల్లవరం, మిడుతూరు మండలంలోని రోళ్లపాడు గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన గోకులం షెడ్లను ఎమ్మెల్యే జయసూర్య శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క గోకులం షెడ్డు కు రూ.2.30 లక్షలు మంజూరు చేసిందని, వీటిని రైతును సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.