నందికొట్కూరు: అర్హులందరికీ ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం

84చూసినవారు
నందికొట్కూరు: అర్హులందరికీ ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం
నందికొట్కూరులోని కొణిదెల గ్రామంలో బుధవారం ఇల్లు లేని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించినట్లుగా ప్రతి అర్హ నిరుపేదకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్, తాసిల్దార్ శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్