ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలు అమలు చేయకుంటే పతనం తప్పదని సిపిఐ (యoయల్) పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ విషయమై సోమవారం నందికొట్కూరు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు పాల్గొన్నారు.