నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా ఎస్‌ఐ సార్ సూచనల మేరకు మంగళవారం శివారు ప్రాంతాల్లో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ఈ దర్యాప్తులో మూడు ఓపెన్ డ్రింకింగ్ కేసులు పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు.