మహాత్మ జ్యోతిరావు పూలే 135 వర్ధంతి సందర్భంగా గురువారం నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డు నందు నంద్యాల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి ఆధ్వర్యంలో.. ఉద్యోగ సంఘం అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలని ఆయన కోరారు.